ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు బీఎల్ సంతోష్ కనిపించడం లేదంటూ పోస్టర్లు!
- తెలంగాణలో కలకలం రేపిన ఎమ్మెల్యేలకు ఎర అంశం
- బీజేపీ నేత బీఎల్ సంతోష్ సూత్రధారి అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు
- హైదరాబాద్ లో పలుచోట్ల వెలసిన పోస్టర్లు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సూత్రధారి ఆయనే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సంతోష్ పై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తమ మాట వినకుండా విచారణ జరిపితే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరించింది.