' మీటర్' నుంచి మరో మాస్ బీట్ .. సాంగ్ ప్రోమో రిలీజ్!
- కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీగా 'మేటర్'
- పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న హీరో
- కథానాయికగా అతుల్య రవి పరిచయం
- ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల
ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. జోరుగా .. హుషారుగా మాస్ బీట్ తో సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునేదిలా ఉంది.
ఈ నెల 15వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. ఈ సినిమాతో కథానాయికగా 'అతుల్య రవి' పరిచయం కానుంది. 'వినరో భాగ్యము విష్ణుకథ' తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా కిరణ్ బలమైన నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముస్తాబవుతూ ఉండగానే, మరో సినిమాను ఇటీవలే ఆయన పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.