అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- ఇప్పటికే అవినాశ్ రెడ్డిని రెండుసార్లు విచారించిన వైనం
- నేడు మూడోసారి విచారణ
- తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాశ్ పిటిషన్
- నేడు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
అవినాశ్ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. అందుకు కోర్టు స్పందిస్తూ... వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. కాగా, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను సీబీఐ విచారించడం ఇది మూడోసారి.