ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన సూర్య, జ్యోతిక?
- ఇప్పటి వరకు కలిసే ఉన్న సూర్య, కార్తీ, వారి తండ్రి
- జ్యోతిక సినిమాల్లో నటించకూడదనే కండిషన్ తో సూర్య పెళ్లికి ఒప్పుకున్న ఆయన తండ్రి
- జ్యోతిక మళ్లీ నటిస్తుండటంతో మొదలైన సమస్యలు
అయితే, ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సూర్య, జ్యోతిక బయటకు వచ్చారని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా జ్యోతికే అంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి సూర్య ముంబైలో మకాం పెట్టాడని అంటున్నారు. ముంబైలో సూర్య ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని... ఆ ఇంటికి వీరు షిఫ్ట్ అయ్యారని చెపుతున్నారు.
వాస్తవానికి జ్యోతికను సూర్య పెళ్లి చేసుకోవడం ఆయన తండ్రికి ఇష్టం లేదని... అయితే కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారని సమాచారం. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించకూడదనే కండిషన్ ను ఆయన పెట్టారట. అయితే, జ్యోతిక మళ్లీ సినిమాలు చేస్తుండటాన్ని సూర్య తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారని... ఇంట్లో విభేదాలు రావడానికి ఇదే కారణమని చెపుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.