సుధాకర్ కోసం వస్తుండే ఆ వ్యక్తి చిరంజీవి అని అప్పట్లో నాకు తెలియదు: నటి లక్ష్మిప్రియ
- కేరక్టర్ ఆర్టిస్టుగా లక్ష్మీప్రియకి మంచి పేరు
- పల్లెటూరు నుంచి తన ప్రయాణం మొదలైందన్న నటి
- తనతో కలిసి సుధాకర్ నాటకాలు వేసేవాడని వెల్లడి
- ఆయన కోసం చిరంజీవి వచ్చేవారని వివరణ
"నేను .. కమెడియన్ సుధాకర్ కలిసి ఒక నాటకం వేయవలసి ఉంది. ఆ నాటకంలో నేను అక్క .. ఆయన తమ్ముడు. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేస్తుండగా. సుధాకర్ కోసం ఒక వ్యక్తి వచ్చి వెయిట్ చేసేవారు. 'నేను పెద్ద హీరోనవుతాను' అనేది ఆ నాటకంలో సుధాకర్ డైలాగ్. అలాగే ఆ నాటకం తరువాత ఆయన హీరో అయ్యాడు" అని చెప్పారు.
"కొన్ని రోజుల తరువాత 'అగ్ని సంస్కారం' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. జీవీ ప్రభాకర్ గారు దర్శకుడు. ఆ సినిమాలో హీరో చిరంజీవి అని చెప్పారు. సెట్లో ఆయనను చూసి షాక్ అయ్యాను. గతంలో సుధాకర్ కోసం వస్తుండే వ్యక్తి ఆయనే అని గ్రహించి ఆశ్చర్యపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.