'అన్నీ మంచి శకునములే' నుంచి గౌతమి లుక్ రిలీజ్!
- స్వప్న సినిమాస్ బ్యానర్ పై 'అన్నీ మంచి శకునములే'
- ' ఓ బేబీ' తరువాత నందినీ రెడ్డి చేసిన సినిమా ఇది
- సంతోష్ శోభన్ జోడీగా మాళవిక నాయర్
- కీలకమైన పాత్రలో రావు రమేశ్
- ఈ నెల 4వ తేదీన టీజర్ రిలీజ్
ఈ సినిమా నుంచి నిన్న రాజేంద్ర ప్రసాద్ పాత్రను పరిచయం చేస్తూ, ఆయన ఫస్టు పోస్టర్ ను వదిలారు. అలాగే కొంతసేపటి క్రితం గౌతమి పోషించిన 'మీనాక్షి' పాత్రను పరిచయం చేస్తూ, ఆమె పోస్టర్ ను వదిలారు. అల్లిక పనిలో ఉన్న గౌతమి లుక్ సహజత్వంతో ఆకట్టుకుంటోంది.
ఇటీవల కాలంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న మాళవిక నాయర్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. రావు రమేశ్ .. వెన్నెల కిశోర్ .. నరేశ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు.