ఉపాసన డెలివరీ ఎక్కడన్నదానిపై క్లారిటీ వచ్చేసింది!
- త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలోనే డెలివరీ
- డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్న అమెరికా డాక్టర్ జెన్నిఫర్
ఈ వ్యాఖ్యలపై ఉపాసన స్పందిస్తూ... డాక్టర్ జెన్నిఫర్ మీ మాటలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నానని.. తమ బేబీకి డెలివరీ చేసేందుకు అపోలో హాస్పిటల్స్ లోని డాక్టర్ సుమన, డాక్టర్ రూమ సిన్హాలతో కలవాలని కోరారు. దీనికి సమాధానంగా... తనకు కూడా రావాలనే ఉందని డాక్టర్ జెన్నిఫర్ అన్నారు. ఇంకోవైపు, ఉపాసన అమెరికాలో డెలివరీ చేయించుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఉపాసన వ్యాఖ్యలతో డెలివరీ ఇక్కడే జరగనుందనే విషయం స్పష్టమయింది.
