దసరాలో ధరణిగా నాని.. లుంగీ కట్టుకొని క్రికెట్ ఆడుతున్న మాస్ సీన్ రిలీజ్
- నాని పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల
- హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేశ్
- మార్చి 30న విడుదల అవుతున్న చిత్రం
శుక్రవారం నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు మరో కానుక అందించింది. నాని మాస్ క్యారెక్టర్ పవర్ చూపెట్టే మరో వీడియో గ్లింప్స్ విడుదల చేసింది. ఈ చిత్రంలో నాని ఫైర్ బ్రాండ్ ధరణి పాత్రలో నటిస్తున్నాడు. లుంగీ పైకి కట్టి, కళ్లజోడు పెట్టి, బీడీ తాగుతూ క్రికెట్ ఆడిన నాని.. షాట్ కొట్టగానే.. బ్యాట్‌ని గాల్లో విసిరేసి నడుచుకుంటూ వచ్చే సీన్ ఆసక్తికరంగా ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 30న విడుదల కానుంది.