మహామహా నేతలే నా ముందు మోకరిల్లారు... కేసీఆర్ ఎంత?: కేఏ పాల్
- కేసీఆర్ దొంగ అని రుజువు చేస్తా
- నేను ప్రార్థిస్తే కేసీఆర్ నాశనం అవుతారు
- నా సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారు
కేసీఆర్ తనను చంపేస్తే తాను స్వర్గానికి వెళ్తానని... కానీ చేసిన అవినీతికి కేసీఆర్ మాత్రం నరకానికే వెళ్తారని అన్నారు. తాను ప్రార్థిస్తే చాలు కేసీఆర్ సర్వనాశనం అవుతారని చెప్పారు. దైవ దూతల మీద చేయి వేస్తే దేవుడు క్షమించడని... వైయస్ రాజశేఖరరెడ్డి, తన తమ్ముడు కూడా భూమి మీద నుంచి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ దొర కాదు... దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని చెప్పారు.