'రంగ మార్తాండ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- కృష్ణవంశీ రూపొందించిన 'రంగ మార్తాండ'
- ఓ రంగస్థల కళాకారుడి ఆవేదనే ఈ కథ
- కీలకమైన పాత్రను పోషించిన బ్రహ్మానందం
- ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ
- మనసును తాకే సిరివెన్నెల సాహిత్యం
'పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం .. రెండూ ఒకటే నాణానికి .. బొమ్మాబొరుసంతే..' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించారు. ఇళయరాజా స్వరపరచడమే కాకుండా, స్వయంగా ఆలపించారు.
'ఒక పాత్ర ముగిసింది నేడు .. ఇంకెన్ని మిగిలాయో చూడు, నడిపేది పైనున్న వాడు .. నటుడేగా నరుడన్నవాడు' వంటి లైన్స్ ఈ పాటకి హైలైట్. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.