చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆజంఖాన్‌పై జయప్రద ఫైర్
- ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనన్న జయప్రద
- ఆజంఖాన్, ఆయన కుమారుడికి మహిళలను గౌరవించడం తెలియదన్న బీజేపీ నేత
- అధికార గర్వం ఉండకూడదన్న మాజీ ఎంపీ
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగం చేశారంటూ నమోదైన కేసులో ఆజంఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్వత్యాన్ని కోల్పోయారు. 2008లో ఓ ధర్నాకు సంబంధించిన కేసులో ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన కూడా ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆజంఖాన్‌పై అప్పట్లో కేసు నమోదైంది.