పుజారానే తీసేశారు.. కేఎల్ రాహుల్ ఎంత?: వెంకటేశ్ ప్రసాద్
- ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్
- కౌంటీల్లో ఆడి ఫామ్ ను సాధించాలన్న వెంకటేశ్ ప్రసాద్
- గతంలో పుజారా ఇదే పని చేశాడన్న మాజీ పేసర్
కేఎల్ రాహుల్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారని... అందులో నిజం లేదని వెంకటేశ్ ప్రసాద్ చెప్పారు. రాహుల్ కు అంతా మంచే జరగాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ తో ఆడితే ఆయన ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లే అవకాశం ఉందని చెప్పారు. పాత ఫామ్ ను మళ్లీ అందుకోవడం రాహుల్ కు చాలా అవసరమని... మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడటమే మార్గమని సూచించారు. ఇప్పటికే రంజీ సీజన్ ముగియడం వల్ల... కౌంటీ క్రికెట్ లో ఆడి భారత జట్టులో మళ్లీ స్థానాన్ని సాధించుకోవాలని చెప్పారు.
టీమ్ లో పుజారా స్థానాన్ని కోల్పోయినప్పుడు ఇదే పని చేశాడని వెంకటేశ్ ప్రసాద్ గుర్తు చేశారు. పుజారాకు ఉన్నంత అనుభవం రాహుల్ కు లేదని చెప్పారు. 100 టెస్టులు ఆడిన పుజారానే పక్కన పెట్టారని... అలాంటప్పుడు రాహుల్ ను ఇంకా ఆడించడంలో అర్థం లేదని అన్నారు. ఈ మేరకు వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు చేశారు.