చిరుతపులిను ఢీకొట్టి గాయపడిన అక్షయ్ కుమార్ మేకప్ మ్యాన్
- ముంబయి శివార్లలో ఘటన
- షూటింగ్ లొకేషన్ కు స్నేహితుడ్ని డ్రాప్ చేసేందుకు వచ్చిన మేకప్ మ్యాన్
- పందిని తరుముతూ రోడ్డుపైకి వచ్చిన చిరుత
- బైక్ ను నియంత్రించలేకపోయిన మేకప్ మ్యాన్
తన స్నేహితుడ్ని షూటింగ్ లొకేషన్ లో డ్రాప్ చేసేందుకు శ్రవణ్ ఓ బైక్ పై వచ్చాడు. సెట్స్ కు కొద్ది దూరంలో ఓ పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. ఆ పందిని తరముకుంటూ ఓ చిరుత కూడా దూసుకుని వచ్చింది. ఈ క్రమంలో, శ్రవణ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి చిరుతను ఢీకొట్టింది.
దాంతో శ్రవణ్ కిందపడిపోగా, ఆ చిరుత అతడి చుట్టూ తిరిగింది. శ్రవణ్ కు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత స్పృహకోల్పోయాడు. అక్కడివారు అతడిని గమనించి ఆసుపత్రికి తరలించారు.