త్వరలోనే హిట్ కొట్టేద్దాం: విజయ్ దేవరకొండ
- కెరీర్ ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లిన విజయ్
- ఇప్పుడు వరుస పరాజయాలతో డీలాపడ్డ వైనం
- ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన విజయ్
దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి కథను కూడా విజయ్ ఓకే చేశాడు. కొన్నాళ్లుగా అపజయాల్లో ఉన్న విజయ్ త్వరలోనే హిట్ కొడతానని అంటున్నాడు. ట్విట్టర్ వేదికగా విజయ్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మర్చిపోలేని ఒక్క హిట్ ఇవ్వన్నా అని అడిగాడు. దానికి స్పందించిన విజయ్ ‘హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.