హంగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు: కోమటిరెడ్డిపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
- తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్న కోమటిరెడ్డి
- కోమటిరెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్న గుత్తా
- తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా
వ్యవసాయరంగం పునరుజ్జీవం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ వెనుక నడవాలని దేశ ప్రజలు భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్, బీఆర్ఎస్ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల మాదిరే కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. తన కుమారుడు గుత్తా అమిత్ రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయం ప్రకారమే ఉంటుందని తెలిపారు. అదానీ లాంటి వాళ్లు ప్రభుత్వ సంస్థలను ముంచేస్తున్నారని... ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.