నవ్వితే షూటింగ్ ఆగాల్సిందే... విచిత్రమైన సమస్యతో ఇబ్బంది పడుతున్న అనుష్క
- నవ్వు ఆపుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతున్న అనుష్క
- నవ్వితే.. 15 నిమిషాల పాటు అలాగే నవ్వుతున్న స్వీటీ
- అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతుంటానన్న అనుష్క
మరోవైపు ఆమెకు సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో ఆమె ఇబ్బంది పడుతోందనేదే ఆ వార్త. ఒక్కసారి నవ్వితే... కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది. తాను నవ్వడం ప్రారంభిస్తే... షూటింగ్ ను కాసేపు ఆపేస్తారని అనుష్క తెలిపారు. తాను అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పారు.