కేటీఆర్ గారు నగరానికి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకువస్తున్నారు: రామ్ చరణ్
- హైదరాబాదులో నేటి నుంచి ఫార్ములా-ఇ గ్రాండ్ ప్రీ
- మహీంద్రా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
- నిన్న ఆనంద్ మహీంద్రా, కేటీఆర్ లను కలిసిన వైనం
దీనిపై చరణ్ నేడు ట్వీట్ చేశారు. మహీంద్రా రేసింగ్ జట్టు శిబిరంలో ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నానీలతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని వెల్లడించారు. ఫార్ములా-ఇ రేసింగ్ లో వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరానికి ఇంతటి అమోఘమైన కార్యక్రమాలు తీసుకువస్తున్న కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.