300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!
- తమిళనాట కొనసాగుతున్న 'వరిసు' జోరు
- నిన్నటితో 300 కోట్ల గ్రాస్ వసూలు
- ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచిన కథ
- తారాగణం పరంగాను కనిపించిన భారీతనం
- హైలైట్ గా నిలిచిన సంగీతం .. ఫొటోగ్రఫీ
దిల్ రాజు నిర్మాణ విలువలకు సంబంధించిన విషయంలో ఎక్కడా రాజీ పడలేదనే విషయం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రలోను స్టార్స్ నే పెట్టారు. అలా ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. విజయ్ సరసన కథానాయికగా రష్మిక నటించిన ఈ సినిమాలో, జయసుధ .. శరత్ కుమార్ .. ప్రకాశ్ రాజ్ .. సుమన్ .. ప్రభు .. 'కిక్' శ్యామ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించారు.
తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ గనుక 300 కోట్లను కొల్లగొట్టడానికి కొంత సమయం తీసుకుంది. అదే విజయ్ మార్క్ మాస్ మూవీ అయితే, ఈ వసూళ్లను ఎప్పుడో రాబట్టి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా 'వారసుడు' పేరుతో తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే.