యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
- కొత్త దర్శకుడు రూపొందించిన 'శశివదనే'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ
- హీరోగా పరిచయమవుతున్న రక్షిత్ అట్లూరి
- సంగీత దర్శకత్వం వహించిన వాసుదేవన్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టైటిల్ సాంగ్. 'నాలో నేను ఏవో కలలు కంటున్నానుగా .. నీతో చేరి ఆ కలలు అన్నీ నిజమవుతాయిగా' అంటూ ఈ పాట మొదలవుతోంది.
హీరో .. హీరోయిన్లపై అందమైన గ్రామీణ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. వాసుదేవన్ అందించిన బాణీకి .. కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని సమకూర్చగా, హరిచరణ్ - చిన్మయి శ్రీపాద ఆలపించారు. కొంతకాలంగా తెలుగులో చేస్తూ వస్తున్న కోమలీ ప్రసాద్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.