సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోటంరెడ్డికి బాలినేని సలహా
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి
- సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి
- ట్యాపింగ్ పై ముందే ఎందుకు చెప్పలేదన్న బాలినేని
- కోటంరెడ్డి అపోహపడుతుండొచ్చని వ్యాఖ్యలు
- సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరగదన్న కాకాణి
ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నిజమే అయితే ఆ విషయాన్ని కోటంరెడ్డి ఎందుకు ప్రభుత్వానికి ముందే చెప్పలేదు? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి పొరబడుతుండొచ్చని అన్నారు. ముందు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందో, లేదో నిర్ధారణ చేసుకోవాలని బాలినేని హితవు పలికారు. ఏ నేతకైనా తాము ఒకటే చెబుతామని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఇలాంటివన్నీ టీకప్పులో తుపాను వంటి వ్యవహారాలని కొట్టిపారేశారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరగదని, కోటంరెడ్డి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు.