'సాహూ' దర్శకుడితో పవన్ .. పూజా కార్యక్రమానికి హాజరు!
- సెట్స్ పై ఉన్న 'హరి హర వీరమల్లు'
- మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్
- నిర్మాతగా డీవీవీ దానయ్య
- దర్శకుడిగా సుజిత్ కి మరో భారీ ఛాన్స్
తాజాగా ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకి పవన్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన అప్ డేట్ బయటికి వచ్చేసింది. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. గతంలో ఆయన నుంచి భారీ హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రతినాయకుడిగా ఎవరిని తీసుకోనున్నారు? సాంకేతిక నిపుణులు ఎవరు? రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాస్త ఆలస్యమైనా సుజిత్ పెద్ద ప్రాజెక్టునే పట్టాడని చెప్పుకోవాలి.
.