ఎన్టీఆర్–కొరటాల చిత్రం కోసం హైదరాబాద్‌లో సముద్రం సెట్
- సాబు సిరిల్ సమక్షంలో శర వేగంగా పనులు
- శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయనున్న ఎన్టీఆర్
- ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్
ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్.. సహజత్వం ఉట్టిపడేలా నగరంలో సముద్రపు సెట్ వేస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట తన పుట్టిన రోజును కూడా సాబు ఈ సెట్ లోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రం షూటింగ్ ను ఘనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌తో పాటు రాజమౌళి కుటుంబం, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఆహ్వానిస్తారని సమాచారం. కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.