అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
- సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య లైఫ్ పై పలు రూమర్లు
- శోభిత దూళిపాళ, ఆ తర్వాత దివ్యాంశతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు
- ఈ వార్తల్లో నిజం లేదన్న దివ్యాంశ
ఈ నేపథ్యంలో, దివ్యాంశ ఈ వార్తలపై స్పందించింది. నాగచైతన్య చాలా బాగుంటాడని.. ఐలవ్ చై అని చెప్పింది. అతనిపై తనకు క్రష్ ఉందని... అయితే, తాము పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో తనకు ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణమనే వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేసింది.