వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
- ఫైబర్ నెట్ స్కాంలో కేంద్రం దృష్టి సారించాలన్న లక్ష్మీపార్వతి
- యువనేత జైలుకు వెళ్లడం తథ్యమని వెల్లడి
- సహవాస దోషం పవన్ కల్యాణ్ కు అంటుకుందని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆమె పవన్ కల్యాణ్ పైనా స్పందించారు. సహవాస దోషం పవన్ కల్యాణ్ కు అంటుకుందని, ఆయన తప్పుడు దారిలో వెళుతున్నారని వెల్లడించారు. చంద్రబాబుతో కలిసి వెళితే పవన్ కు నష్టం తప్ప ఏమీ మిగలదన్నారు. రాష్ట్రంలో విపక్షాలు ప్రజాకంటకంగా మారాయని, అమరావతిని రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చారని విమర్శించారు. వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.