తమిళ్ లో సాయి పల్లవికి బంపరాఫర్
- అజిత్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి!
- విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అజిత్
- ఫిబ్రవరి నుంచి షూటింగ్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించాయి. అయితే సాయిపల్లవిని ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. కథతో పాటు తన పాత్ర నచ్చితేనే సాయి పల్లవి ఒప్పుకుంటుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సాయి పల్లవి నటించడం ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవనుంది.