వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ తాజా చిత్రం
- నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు
- 'గాండీవధారి అర్జున' టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
- మోషన్ పోస్టర్ కూడా విడుదల
'గాండీవధారి అర్జున' చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రం కానుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.