జెర్సీ ఫేం శివ దర్శకత్వంలో పోలీసు పాత్రలో విజయ్ దేవరకొండ
- తన 12వ చిత్రం గురించి ప్రకటన చేసిన విజయ్
- లైగర్ తో నిరాశ పరిచిన టాలీవుడ్ బడా హీరో
- ప్రస్తుతం సమంతతో 'ఖుషి' చేస్తున్న యువ హీరో
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పేందుకు.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. అనామక గూఢచారి’ అంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర బృందం. దీన్ని షేర్ చేసిన విజయ్.. ఇది తన తదుపరి చిత్రం అని ప్రకటించాడు. ‘ఈ స్ర్కిప్ట్ విన్నప్పుడు.. నా గుండె కొన్నిసార్లు కొట్టుకోవడం ఆపేసింది’ అని విజయ్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం విజయ్.. శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.