భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సమంత
- శాకుంతలం ట్రైలర్ లాంచ్ కు వచ్చిన సమంత
- ఈ సినిమాకు సమంతనే హీరో అన్న గుణశేఖర్
- సమంతను నమ్మి దిల్ రాజు కోట్లు పెట్టారని వ్యాఖ్య
ఈ చిత్రంలో సమంతనే హీరో అని గుణశేఖర్ అన్నారనీ, ఈరోజు తాను ఎంతో శక్తిని తెచ్చుకుని ఈవెంట్ కు హాజరయ్యానని సమంత చెప్పారు. గుణశేఖర్ గారికి సినిమానే జీవితమని అన్నారు. తన అంచనాలకు మించి ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని చెప్పారు. ఈ సినిమాకు తనను ఎంపిక చేసిన గుణశేఖర్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ, ఈ సినిమాకు సమంతనే హీరో అని, కేవలం సమంతను నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమై, కోట్ల రూపాయలు పెట్టారని అన్నారు. ఈ మాటలతో సమంత తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకుంది.