అందరూ నాపై పడి ఏడుస్తున్నారు.. 'వారసుడు' విడుదలను వాయిదా వేస్తున్నా: దిల్ రాజు
- సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు
- ఇదే సమయంలో 'వారసుడు' సినిమా విడుదలకు సిద్ధమైన దిల్ రాజు
- తానే ఒక అడుగు వెనక్కి వేస్తున్నానని ప్రకటన
విజయ్ సినిమాను విడుదల చేస్తే చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు తక్కువవుతాయనే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. 'వారసుడు' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న కాకుండా 14వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తమిళ్ వర్షన్ మాత్రం యథావిధిగా 11న విడుదల అవుతుందని చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నానని, తానే ఒక అడుగు వెనక్కి వేశానని చెప్పారు. అందరూ తనపై పడి ఏడుస్తున్నారని... పండ్లున్న చెట్టుకే ఎక్కువ రాళ్ల దెబ్బలు పడతాయని వ్యాఖ్యానించారు. తనను ఎవరూ కార్నర్ చేయలేరని అన్నారు.