విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్.. ప్రకటించిన జగన్
- విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో జగన్ సమీక్ష
- కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడిన జగన్
- వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు తిరుగుండదన్న సీఎం
విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం అవినాష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాలు వైసీపీకి తిరుగుండదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని, ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు.