'మైఖేల్' రిలీజ్ డేట్ ఖరారు!
- 'మైఖేల్'గా సందీవ్ కిషన్
- కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి
- రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన సినిమా ఇది
- ఫిబ్రవరి 3వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను వదిలారు. సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్ కనిపించనున్న ఈ సినిమాలో, కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.
సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. గౌతమ్ మీనన్ .. అనసూయ .. వరుణ్ సందేశ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.
.