బాలకృష్ణగారి టర్కీ ఫైట్ చూసితీరాల్సిందే: రామ్ లక్ష్మణ్
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'వీరసింహారెడ్డి'
- యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన రామ్ లక్ష్మణ్
- గోపీచంద్ మలినేనితో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావన
- ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
తాజా ఇంటర్వ్యూలో ఈ సోదరులు మాట్లాడుతూ .. "గోపీచంద్ మలినేనిగారి 'క్రాక్' సినిమాకి మేము పనిచేశాము. ఆ సినిమాలోని యాక్షన్ పార్టుకు వచ్చిన రెస్పాన్స్ ను చూసి ఆయన మమ్మల్ని 'వీరసింహారెడ్డి' సినిమా కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఇద్దరికీ ఫైట్స్ ఉంటాయి" అన్నారు.
పాత్రపరంగా వాళ్ల బాడీ లాంగ్వేజ్ ను బట్టి ఫైట్స్ కంపోజ్ చేయవలసి ఉంటుంది. ఈ సినిమాలో యంగ్ బాలకృష్ణపై 'టర్కీ'లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చేశాము. ఆ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. చాలా కొత్తగా ఆ ఫైట్ ను డిజైన్ చేయడం జరిగింది. థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ కి విజిల్స్ పడకుండా ఉండవు" అంటూ చెప్పుకొచ్చారు.