'వాల్తేరు వీరయ్య' నుంచి రేపు 'పూనకాలు లోడింగ్' విడుదల
- చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య
- జనవరి 13న రిలీజ్
- ఇప్పటికే మూడు పాటలు రిలీజ్
- ఈసారి చిరు, రవితేజ పాట రిలీజ్ చేస్తున్న చిత్రబృందం
వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మెగా స్పందన వస్తోంది.
వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక. ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలకపాత్రలో కనిపించనుంది.
.