ప్రభాస్ - సుకుమార్ కాంబోపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!
- 'పుష్ప 2'ను రూపొందిస్తున్న సుకుమార్
- 'ప్రాజెక్టు K పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్
- ఇద్దరి కాంబోలో సినిమా అంటూ టాక్
- అదంతా పుకారేనని తేల్చిన నిర్మాతలు
ఈ నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రభాస్ - సుకుమార్ కాంబినేషన్ లో తాము ఒక సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇది కేవలం పుకారు మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేశారు.
తమ బ్యానర్ నుంచి ఎప్పటికప్పుడు మంచి చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటామనీ, ఆ విషయాలను అధికారికంగా తాము తెలియజేస్తూ ఉంటామని అన్నారు. పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్టు K' పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.