పెళ్లయిన హీరోయిన్ కోసం గూగుల్ లో తెగ వెతికేశారు!
- 2022లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన ఆసియన్ల జాబితాలో కత్రినా కైఫ్ కు నాలుగో స్థానం
- బాలీవుడ్ నుంచి మొదటి స్థానం సాధించిన వైనం
- గతేడాది విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న కత్రినా
'సూర్యవంశీ' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కత్రినా 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'ధూమ్ 3', 'జబ్ తక్ హై జాన్', 'జిందగీ నా మిలేగీ దొబారా' వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాల్లో మెప్పించింది. గత ఏడాది డిసెంబర్లో యువ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న కత్రినా ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. వివాహబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఆమె ‘టైగర్-3’, ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రాల్లో నటిస్తోంది.