వాల్తేరు వీరయ్య నుంచి కొత్త పోస్టర్.. ఈసారి స్టయిలిష్ లుక్ లో చిరు
- జనవరి 13న విడుదల కానున్న చిత్రం
- పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్న మెగాస్టార్
- కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ
తాజాగా దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు.