సినీనటి పవిత్ర లోకేశ్ వ్యవహారంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేశ్
- పవిత్ర లోకేశ్, నరేశ్ లపై ప్రచారం
- ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్ర
- తాజాగా నాంపల్లి కోర్టులో నరేశ్ పిటిషన్
- సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు
- 12 మందికి నోటీసులు పంపిన పోలీసులు
ఇదే అంశంలో గతంలో పవిత్ర లోకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వెబ్ సైట్, యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు నరేశ్ పిటిషన్ తో మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ, మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించారు. తమకు అందిన ఫిర్యాదుతో గతంలో విచారణ జరిపామని తెలిపారు. 11 యూట్యూబ్ చానళ్ల వివరాలు ఇవ్వాలని యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశామని పేర్కొన్నారు. యూట్యూబ్ నుంచి ఇంకా సమాచారం రాలేదని అన్నారు.