అంకితా భండారీ హత్య కేసు నిందితులకు నార్కో టెస్టులు!
- ఇప్పటికే కోర్టు అనుమతి కోరిన దర్యాప్తు అధికారులు
- ఉత్తరాఖండ్ రిసార్టులో రిసెప్షనిస్టుగా పని చేసిన అంకితను హత్య చేసిన రిసార్టు యజమాని పులకిత్, అతని స్నేహితులు
- నార్కో పరీక్షల తర్వాతనే చార్జిషీటు దాఖలు చేయనున్న పోలీసులు
రిషికేష్ సమీపంలో పులకిత్ ఆర్య నడుపుతున్న రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత భండారీ సెప్టెంబర్ 18న అదృశ్యమైంది. వ్యభిచారం చేయడానికి నిరాకరించడంతో అంకితాను హత్య చేసి రిషికేష్ సమీపంలోని చిల్లా కాలువలో తొలుత ఆమె తప్పిపోయిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 24న అంకిత మృతదేహం లభ్యం అయ్యింది. ఈ కేసులో పులకిత్ పేరు రావడంతో అతని తండ్రి వినోద్ ఆర్యాను బీజేపీ నుంచి బహిష్కరించారు. ఆ రిసార్టును కూడా అధికారులు అక్రమ కట్టడంగా ప్రకటించి కూల్చివేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికే ఇలా చేశారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.