ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నూతన జరిమానాలు
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమానా
- మాల్స్ పైనా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫైన్ విధించే అవకాశం
ఈ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. అదే విధంగా రెండోసారి పట్టుబడిన వారికి ఏకంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలువ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. ఆయా సంస్థలు, మాల్స్... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే.. రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధిస్తారు.