శివుడొచ్చాడ్రా .. 'బెదురులంక' మోషన్ పోస్టర్ రిలీజ్!
- కార్తికేయ హీరోగా రూపొందిన 'బెదురు లంక'
- ఆసక్తిని రేపుతున్న మోషన్ పోస్టర్
- స్టైలీష్ లుక్ తో కనిపిస్తున్న కార్తికేయ
- కథానాయికగా అలరించనున్న నేహా శెట్టి
కొంతసేపటి క్రితం ఆయన హీరోగా 'బెదురులంక 2012' టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను వదిలారు. కార్తికేయ చాలా స్టైలీష్ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా' అనే ఒక నినాదం వంటి కోరస్ పై ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు.
మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన తీరు కొత్తగానే ఉందిగానీ, కాన్సెప్ట్ ఏమిటనేది అంచనాలకి అందడం లేదు. క్లారిటీతో చెప్పటానికి వాళ్లు ప్రయత్నించలేదు. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నేహా శెట్టి కథానాయికగా కనిపించనుంది.