నీ జీవితమే ఒక పోరాటం .. 'హిట్ 2' నుంచి సాంగ్ రిలీజ్!
- అడివి శేష్ హీరోగా నిర్మితమైన 'హిట్ 2'
- థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
- కీలకమైన పాత్రలో రావు రమేశ్
- డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
"రక్తమే అంటుకున్న చేతులా .. ఎంతకీ వదిలిపోని మరకలా .. నిదురలో పోనే పోనీ చేదు గురుతులా " అంటూ ఈ పాట మొదలవుతోంది. హీరో కార్యదీక్ష .. ఆయన ధైర్యసాహసాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ పాట ప్లే అవుతోంది. పోలీస్ ఆఫీసర్ గా హీరో డ్యూటీకి సంబంధించిన విజువల్స్ పై వచ్చే పాట ఇది.
సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. దర్శకుడు శైలేశ్ కొలను .. నిర్మాత ప్రశాంతి కలిసి ఈ పాటను ఆలపించడం విశేషం. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. పోసాని .. కోమలి ప్రసాద్ కనిపించనున్నారు.