ఘనంగా జరిగిన కోలీవుడ్ ప్రేమ జంట వివాహం
- పెళ్లితో ఒక్కటైన గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్
- చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట
- ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం
సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్. 'దేవరట్టం' సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తానే తొలుత ఆమెకు ప్రపోజ్ చేశానని గతంలో గౌతమ్ తెలిపాడు. మంజిమ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో ఆమె నటించింది.