ప్రపంచంలో తిరుగులేని నేతగా మరోసారి మోదీ
- 77 శాతం రేటింగ్ తో ప్రపంచ స్థాయి నేతల్లో మోదీ అగ్రస్థానం
- రెండో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని
- మూడో స్థానంలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఈ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించింది. 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రభుత్వాలు, నేతల తీరును ట్రాక్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోదీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. తాజా సర్వేలో మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.