అమెజాన్ ప్రైమ్ లో 'వధంది' .. ఉత్కంఠను రేపుతున్న ట్రైలర్!
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'వధంది' వెబ్ సిరీస్
- మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ
- ప్రధాన పాత్రను పోషించిన ఎస్.జె.సూర్య
- డిసెంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఎస్.జె. సూర్య - లైలా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక ఫారెస్టు ప్రాంతంలో ఒక యువతి హత్య జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆ కేసు విచారణను ఎస్. జె. సూర్య చేపడతాడు.
ఆ యువతి తెలిసినవారితో ఆ ప్రాంతానికి వచ్చిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వచ్చి చంపారా? అనే సందేహం ఆ పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. దాంతో ఆయన ఆ యువతితో పరిచయం ఉన్నవారందరిని పిలిపించి ఆరాతీయడం మొదలుపెడతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. 'విక్రమ్ వేద' డైరెక్టర్స్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడం వలన సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది.