తెలంగాణలో రెండు చోట్ల 'జాకీ' అండర్ వేర్స్ పరిశ్రమలు
- తెలంగాణలో జాకీ లో దుస్తుల కంపెనీల స్థాపన
- ఇబ్రహీంపట్నం, ములుగులో యూనిట్లు
- కేటీఆర్ తో కంపెనీ ప్రతినిధుల భేటీ
- 7 వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్
ఎంతో ప్రజాదరణ పొందిన లో దుస్తుల సంస్థ జాకీ (పేజ్ ఇండస్ట్రీస్) తెలంగాణలో రెండు చోట్ల పరిశ్రమలు స్థాపించనుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం, ములుగు ప్రాంతాల్లో జాకీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పనుందని కేటీఆర్ వివరించారు. 1 కోటి లో దుస్తులు ఉత్పత్తి చేయనుందని, జాకీ ఫ్యాక్టరీలతో 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణలో జాకీ సంస్థకు హార్దిక స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.