స్టేజ్ పైనే ఏడ్చేసిన నందూ .. ఓదార్చిన నాగశౌర్య
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'బొమ్మ బ్లాక్ బస్టర్'
- నందూ జోడీకట్టిన రష్మీ
- ఈ నెల 4వ తేదీన విడుదల కానున్న సినిమా
- జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
ఈ స్టేజ్ పై నాగశౌర్య మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం నందూ పడిన కష్టాలు విన్నాను. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేసినట్టుగా కనిపిస్తూనే ఉంది. ఇండస్ట్రీకి రావడం చాలా తేలికే .. కాకపోతే ఇక్కడ నిలదొక్కుకోవడమే కష్టం. నేనైనా చాలామందికి తెలియదేమోగానీ .. రష్మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాను ఎంతగా కష్టపడిందనేది నేను చూశాను" అన్నాడు.
"నందూ చాలా టాలెంటెడ్ అనే విషయం చాలామందికి తెలుసు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది" అంటూ శౌర్య అనగానే, నందూ ఒక్కసారిగా స్టేజ్ పైనే ఏడ్చేశాడు. శౌర్య అతణ్ణి ఓదార్చుతూ .. "నా సినిమాకి చీఫ్ గెస్టుగా నిన్ను పిలిచే స్థాయికి నువ్వు ఎదుగుతావు .." అంటూ అతణ్ణి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాను తాను తప్పకుండా థియేటర్లో చూస్తాననీ .. అందరూ చూడాలని శౌర్య చెప్పాడు.