అప్పటి నుంచి త్రిషకు అభిమానిగా మారిపోయాను: ఫరియా అబ్దుల్లా
- తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా
- ఈ నెల 4వ తేదీన రానున్న ఆమె తాజా చిత్రం
- తన ఫేవరేట్ హీరో సిద్ధార్థ్ అంటూ వెల్లడి
- వర్షం సినిమా నుంచి త్రిష అంటే ఇష్టమన్న ఫరియా
అలీ ప్రశ్నలకు ఫరియా స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా నేను హిందీ సినిమాలను ఎక్కువగా చూసేదానిని. మొదటిసారిగా నేను చూసిన తెలుగు సినిమా 'వర్షం'. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి త్రిష అభిమానిగా మారిపోయాను. ఆమె కోసమని 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చూశాను. ఆ సినిమా నుంచి సిద్ధార్థ్ ఫ్యాన్ గా మారిపోయాను. సిద్ధార్థ్ అంటే నాకు చాలా ఇష్టం' అని అంది.
ఒక హీరోయిన్ గా అందరి దర్శకులతో కలిసి పనిచేయాలనుంది. ముఖ్యంగా రాజమౌళిగారి దర్శకత్వంలో చేయాలనుంది" అంటూ చెప్పుకొచ్చింది. సంతోష్ మాత్రం తనతో వరుసగా సినిమాలు చేయడానికి మేర్లపాక గాంధీకి అభ్యంతరం లేకపోతే, తాను మాత్రం ఆయనతో చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటానంటూ సమాధానమిచ్చాడు.