చైనీయులకు నిరసన అస్త్రంగా మారిన బప్పీలహరి సాంగ్
- జీ మీ, జీ మీ అంటూ ఖాళీ పాత్రలతో నిరసన వ్యక్తీకరణ
- బప్పీలహరి బాణీలు సమకూర్చిన జిమ్మీ, జిమ్మీ ఆజా ఆజా పాటకు అనువాదం
- జీరో కోవిడ్ విధానంతో ఆహారం దొరకని పరిస్థితి
చైనాలో సామాజిక మాధ్యమం డూయిన్ ద్వారా వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1982లో 'డిస్కో డాన్సర్' సినిమా కోసం బప్పీలహరి బాణీలు సమకూర్చిన జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాటను పార్వతి ఖాన్ ఆలపించారు. దీన్నే చైనా మాండరీన్ భాషలోకి అనువదిస్తే ‘జీ మీ, జీ మీ’ అని వస్తుంది. దీని ఇంగ్లిష్ అనువాదం గివ్ మీ రైస్, గివ్ మీ రైస్. చైనీయులు ఖాళీ పాత్రలను పట్టుకుని జీ మీ, జీ మీ అని ఆలపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమంపై చక్కర్లు కొడుతున్నాయి. హిందీ పాటలకు చైనాలో మంచి ఆదరణే ఉందన్న విషయం గమనార్హం.