టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు.. నిందితుల రిమాండ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారనే కేసు
- నిందితుల రిమాండ్ కు అంగీకరించని ఏసీబీ కోర్టు
- హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసిన పోలీసులు
- రిమాండ్ కు అనుమతించిన హైకోర్టు
- నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశం
ఈ క్రమంలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నిన్న పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... నిందితులు హైదరాబాద్ ను విడిచి వెళ్లొద్దని షరతు విధించిన సంగతి తెలిసిందే. పిటిషన్ పై విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా నిందితులను రిమాండ్ కు అనుమతించింది. నిందితులను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది.