టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్
- 2012లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన రాపోలు
- పదవీ కాలం పూర్తి అయ్యాక 2019లో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ
- బుధవారం ఉదయమే బీజేపీకి రాజీనామా చేసిన వైనం
- కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీసీ నేత
తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే సీఎం కేసీఆర్ తో భేటీ అయిన రాపోలు... బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. అదే సమయంలో చేనేతకు భరోసా కలిగించేలా టీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టిందని కేసీఆర్ సర్కారును కీర్తించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బీజేపీకి రాజీనామా చేసిన ఆయన రాత్రికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.